మహేష్ 23 ఫస్ట్ లుక్ పై అనేక రూమర్లు
- March 28, 2017 / 08:03 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావచ్చింది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వియాత్నం లో జరుగుతోంది. అక్కడ కీలక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ లుక్ చూద్దామని అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రిన్స్ ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని చెప్పారు. అంటే రేపు రావాలి.. కానీ ఈ విడుదల వాయిదా అయిందని రూమర్ గుప్పుమంది. కోలీవుడ్ వర్గాల వారు కారణాన్ని కూడా వెల్లడించారు.
“మహేష్ పరభాషా హీరో కాబట్టి ఆయన సినిమాకు టాక్స్ విషయంలో అక్కడి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం లేదు. టాక్స్ విషయం ఫైనల్ అయ్యాకే సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టాలనే రూల్ కూడా ఉంది. అన్ని రకాల ట్యాక్స్ ఇబ్బందులను తొలిగించుకొని రేపు లుక్ వస్తుందా? లేక చర్చల కోసం కొన్ని రోజులు వాయిదా వేస్తారా?” అని ఓ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయం నిజమైతే మహేష్ అభిమానులకు ఇది చేదు వార్తే అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















