Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

ఇండియన్‌ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టిన సినిమా ‘బాహుబలి’. అప్పటికే మన సినిమాకు విదేశీ గడ్డ మీద పరిచయం ఉన్నా.. మన సినిమా కోసం వెతికి మరీ విదేశీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిన చిత్రంగా ‘బాహుబలి’ని చెప్పొచ్చు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని ఏళ్లుగా మరో మాట వినిపిస్తూ వచ్చింది. అదే ‘బాహుబలి 3’. అవును ఈ సినిమాకు మూడో పార్టు ఉంటుందని.. అక్కడా ఇక్కడా కొంతమంది చెప్పడం విన్నాం. అయితే ఇప్పటివరకు అధికారికంగా సినిమా గురించి ఎవరూ చెప్పలేదు.

Baahubali 3

ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమా రెండో సీక్వెల్‌ అంటే మూడో ‘బాహుబలి’ గురించి సినిమాలో కీలక పాత్రధారులు మాట్లాడారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సర్‌ప్రైజింగ్‌గా ‘బాహుబలి 3’ ఉంటుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. మీ అందరికోసం ‘బాహుబలి’ మూడో భాగం రానుంది’ అని చెప్పారు.

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ప్రచారం సమయంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘బాహుబలి 3’ తీయడానికి అవకాశం ఉందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పార్ట్‌ 3 తీస్తానని చెప్పారు. అయితే, ఇప్పుడు ఈ ముగ్గురూ స్పష్టత ఇవ్వడంతో ‘వారణాసి’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ‘బాహుబలి’ మూడో భాగమే అని అర్థమవుతోంది. మన సినిమాకు విదేశాల్లో కాస్త ఇమేజ్‌ ఉన్న రోజుల్లోనే ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ లాంటి హిట్లు ఇచ్చారు జక్కన్న. అలాంటిది ‘వారణాసి’ తర్వాత ఊహించని ఇమేజ్‌తో దూసుకుపోయే రాజమౌళి ‘బాహుబలి 3’ సినిమా తీస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది అని చెప్పొచ్చు.

రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus