ఏనుగుపై బాహుబలి
- February 25, 2017 / 05:53 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సందర్భానుసారంగా బాహుబలి కంక్లూజన్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకొని బాహుబలి 2 ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన జక్కన్న, రిపబ్లిక్ నాడు సెకండ్ లుక్ ని ఆవిష్కరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’కి సంబంధించిన మూడో పోస్టర్ (రెండో మోషన్ పోస్టర్) ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఏనుగు తలపై ఠీవిగా నిలబడి ఉన్నారు. పోస్టర్‌తో పాటు, అందులో ప్రభాస్ నిలుచున్న విధానం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటోంది.
మాహిష్మతి రాజ్యంలో ఓ పండుగ వాతావరణాన్ని ఈ పోస్టర్ ప్రతిబింబిస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వీఎఫ్ వర్స్క్ జరుపుకుంటోంది. ఎటువంటి ఆలస్యం లేకుండా ఏప్రిల్ 28న సినిమాని రిలీజ్ చేసేందుకు జక్కన్న బృందం శ్రమిస్తోంది. ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















