బాహుబలి కంక్లూజన్ టీజర్ రిలీజ్ తేదీ ఫిక్స్

  • January 7, 2017 / 07:17 AM IST

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ బాహుబలి కంక్లూజన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్ర టీజర్ ని యూట్యూబ్ లో ఈ నెల 24 న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ డే నుంచి థియేటర్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూవీ రాయిస్ ఈనెల 25 న విడుదలకానుంది. ఈ సినిమా ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో బాహుబలి 2 టీజర్ వేయనున్నారు.

అయితే ఇది హిందీ భాషలో ఉంటుంది. తెలుగు టీజర్ ని ఎప్పటినుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారో ఇంకా జక్కన్న చెప్పలేదు. ఈసారి అన్నిభాషల్లో చిత్రాన్ని ఒకే సారి రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే తొలుత హిందీ భాషలో ప్రచారాన్ని మొదలెట్టారు. ఆ తరవాత ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ భాషల్లో పబ్లిసిటీ జోరు పెంచనున్నారు. వెయ్యికోట్ల కలక్షన్స్ పై రాజమౌళి దృష్టిపెట్టారు. కావున మార్చి నాటికి చిత్రానికి సంభందించిన అన్ని పనులు పూర్తిచేసి టీమ్ మొత్తం పబ్లిసిటీ పై దృష్టిపెట్టనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus