Baladitya: ఆ హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుందన్న బాలాదిత్య!

  • September 12, 2022 / 01:47 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్ బాలాదిత్య బిగ్ బాస్ షోకు వెళ్లకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం నా టార్గెట్ అని చెప్పారు. హీరో అనే మాటను నేను పెట్టుకోలేదని బాలాదిత్య చెప్పుకొచ్చారు. యాక్టర్ గా మారితే భిన్నమైన పాత్రలు వస్తాయని ఆయన వెల్లడించారు. నాకు పర్సనల్ గా ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు , మురళీశర్మ ఇష్టమని ఆయన తెలిపారు.

వాళ్లు ఎంచుకునే పాత్రలు కొత్తగా ఉంటాయని అన్నారు. పాత్రల ఎంపిక విషయంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, నవజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఇష్టమని ఆయన వెల్లడించారు. అమితాబ్, కమల్ లను హీరోలుగా కంటే యాక్టర్లుగా ఇష్టమని తెలిపారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని బాలాదిత్య పేర్కొన్నారు. నేను హీరో అయిన తర్వాత అల్లు అర్జున్ అంటే ఇష్టం ఏర్పడిందని ఆయన తెలిపారు.

బన్నీ స్టైల్, హార్డ్ వర్క్ వల్ల ఆయనకు ఫ్యాన్ అయిపోయానని బాలాదిత్య అన్నారు. హీరోయిన్లలో సమంత అంటే చాలా ఇష్టమని బాలాదిత్య చెప్పుకొచ్చారు. సమంత ఎంచుకునే సినిమాలు చాలా బాగుంటాయని బాలాదిత్య పేర్కొన్నారు. సమంత యాక్ట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుందని ఛాలెంజింగ్ రోల్స్ ను ఆమె ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని బాలాదిత్య అన్నారు.

ఈటీవీ నుంచి ఛాంపియన్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా ఛాన్స్ రావడంతో సంతోషంగా అనిపించిందని ఆయన తెలిపారు. అన్ని ఏజ్ గ్రూప్ ల వాళ్లకు ఛాంపియన్ షో ఇష్టమని బాలాదిత్య తెలిపారు. సినిమాలు మంచివి రావడం లేదని సీరియళ్లలోకి వచ్చానని బాలాదిత్య తెలిపారు. బాలాదిత్య బిగ్ బాస్ షో ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. టాప్5 లో బాలాదిత్య కచ్చితంగా ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus