Venu,Balakrishna: బలగం మూవీ దర్శకునికి బాలయ్య అవకాశమిస్తారా?

బలగం సినిమాతో డైరెక్టర్ వేణు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే ఈ డైరెక్టర్ తర్వాత సినిమా బాలయ్యతో తెరకెక్కనుందని వేణు బాలయ్యకు సరిపోయే ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలగం డైరెక్టర్ కు బాలయ్య ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతుండగా మరి కొందరు మాత్రం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

బాలయ్య 110వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య వేణు కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఈ కాంబినేషన్ సంచలనం అయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

వేణు (Venu) తర్వాత సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. బాలయ్య పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతుండగా బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

బాలయ్య మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తన రేంజ్ ను పెంచే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేయాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలయ్య, తారక్ కాంబినేషన్ ను చూడాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ విషయంలో బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus