Akhanda movie: అఖండ మూవీ అప్పటికి వాయిదా పడిందా..?

Advertisement

ఈతరం దర్శకుల్లో బాలకృష్ణకు సరిపోయే కథలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకుంటున్న దర్శకునిగా బోయపాటి శ్రీను పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్యకు బోయపాటి శ్రీను విజయాలను అందించారు. అఖండతో బాలయ్య, బోయపాటి శ్రీను మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించపోయినా అఖండ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జులై చివరి వారం వారకు కరోనా కేసులు తగ్గే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. అందువల్ల అఖండ మేకర్స్ ఈ సినిమాను ఏకంగా సెప్టెంబర్ కు వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలయ్యకు జోడీగా ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి దాదాపు 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అఖండ థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.

హాట్ స్టార్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పూర్ణ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటించనున్నారు. క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణను ఫ్యాక్షనిస్ట్ గా చూపించబోతున్నారని వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి మీనా ఒక హీరోయిన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus