ఎండల్లో కష్టపడుతున్న అఖిల్, బాలయ్య
- April 19, 2017 / 06:44 AM ISTByFilmy Focus
ఏప్రిల్ మొదలు అయినప్పటినుంచి భాస్కరుడు భగ భగ మండిపోతున్నాడు. సామాన్యులు సైతం పది దాటితే ఇంటి నుంచి కాలు బయట పెట్టడంలేదు. కానీ అక్కినేని ప్రిన్స్ అఖిల్, నటసింహ బాలకృష్ణ ఎండల్లో చమటోడుస్తున్నారు. అఖిల్ సినిమా తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని విక్రమ్ కుమార్ కథ కు ఒకే చెప్పారు. అది ఈనెల నాలుగో తేదీ నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకుంటోంది. హైదరాబాద్ ఎండల్లో సైతం షెడ్యూల్ కు బ్రేక్ ఇవ్వకుండా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘విక్రమ్ కుమార్ సినిమా కోసం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. రోజు రోజుకి ఎండ వేడి పెరుగుతోంది. అలాగే వర్క్ కూడా ఇంకా బెటర్ గా నడుస్తోంది’ అన్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఎండల్లో కష్టపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాని ముందుగా ప్రకటించినట్లుగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయడానికి బాలయ్య ఎండలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. వీరి కష్టానికి సూపర్ హిట్ రూపంలో ప్రతిఫలం దక్కాలని ఫిల్మ్ ఫోకస్ కోరుకుంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















