Balakrishna: అక్కడ కూడా బాలయ్య డామినేషన్ అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • March 17, 2024 / 07:19 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలు సాధించి క్రేజ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం బాబీ (Bobby) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తైందని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తేదీకి సంబంధించిన ప్రకటన రావడంతో బాలయ్య హిందూపురంలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ2 (Akhanda) సినిమాకు సంబంధించి కూడా ప్రకటన రానుందని భోగట్టా.

అయితే ఒక తమిళ సినిమాలో యోగిబాబు (Yogi Babu) జై బాలయ్య అనే స్లోగన్ చెప్పగా ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలలో జై బాలయ్య స్లోగన్ ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. థుకుదురై అనే హర్రర్ కామెడీ మూవీలో యోగిబాబు నటించగా ఈ ఏడాది జనవరి నెలలో ఈ సినిమా విడుదలైంది. సినిమాలో యోగిబాబు పాత్ర జై బాలయ్య అనే స్లోగన్ చెప్పగానే మాయమైపోతుంది.

ప్రస్తుతం థూకుదురై మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య క్రేజ్, పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

బాలయ్య భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషల్లో సైతం స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. బాలయ్య బాబీ సినిమా డిజిటల్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా వాల్తేరు వీరయ్య సినిమాను మించి హిట్ గా నిలుస్తుందని బాబీ భావిస్తున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus