టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ శరవేగంగా సినిమాలలో నటిస్తూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది బాలయ్య సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కాకపోయినా జనవరి నెలలో వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలవాలని బాలయ్య అభిమానులు ఆశ పడుతున్నారు. అయితే బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ గురించి ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతోంది.
యంగ్ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాలు ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబో సూట్ కాదని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్యకు సూటయ్యే కథలతో సినిమాలను తెరకెక్కించడం అందరు దర్శకులకు సాధ్యం కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. గతంలో కొంతమంది డైరెక్టర్లను నమ్మి బాలయ్య ఛాన్స్ ఇవ్వగా ఆ దర్శకులు బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
బాలయ్య స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని కెరీర్ పరంగా ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని అభిమానులు సూచిస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా పూర్తైన తర్వాత ప్రశాంత్ వర్మ లేదా పరశురామ్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఇద్దరు డైరెక్టర్లలో బాలయ్య అభిమానులు పరశురామ్ కు ఓటేస్తున్నారు.
అయితే బాలయ్య మనస్సులో ఉన్న డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. త్వరలో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రానుంది. వీరసింహారెడ్డి సక్సెస్ సాధిస్తే బాలయ్య 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది.