Balakrishna: మోక్షజ్ఞ లైనప్ విషయంలో క్లారిటీ ఇదే.. బాలయ్య వాళ్లనే నమ్ముతున్నారా?

  • September 12, 2024 / 07:41 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలు కానుంది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు డైరెక్టర్ కాగా జై హనుమాన్ (Hanu Man) సినిమా గురించి అప్ డేట్స్ ఇచ్చినా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాకపోవడం గమనార్హం. మోక్షజ్ఞ సెకండ్ సినిమాకు బోయపాటి శ్రీను (Boyapati Srinu) , థర్డ్ సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య (Balakrishna) తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకులతో పాటు సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులనే నమ్ముతున్నారని అందుకే వాళ్లకు ఛాన్స్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Balakrishna

మోక్షజ్ఞ లైనప్ విషయంలో దాదాపుగా క్లారిటీ ఇదేనని ఇతర డైరెక్టర్లు ఎవరైనా అద్భుతమైన స్క్రిప్ట్ చెబితే మాత్రమే ఈ లైనప్ మారే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే మోక్షజ్ఞ తర్వాత సినిమాలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి భవిష్యత్తు సినిమాల లైనప్ మారితే ఈ ఆర్డర్ కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ సినిమా సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి నందమూరి హీరోలు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. తారక్  (Jr NTR)  , కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సైతం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి తమ వంతు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మోక్షజ్ఞ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.

మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య మోక్షజ్ఞ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోక్షజ్ఞ జాతకం ప్రకారమే సినిమాల ముహూర్తాల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సల్మాన్‌ సినిమాలో రష్మికతోపాటు మరో సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus