Simbu: శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?

  • September 10, 2024 / 07:05 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శింబు నటించిన కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాల ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతుండగా కోలీవుడ్ హీరో శింబు విరాళం అందించడం ద్వారా వార్తల్లో నిలిచారు. శింబు గొప్ప మనస్సును చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలకు 6 లక్షల రూపాయలు విరాళం అందించిన శింబును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Simbu

శింబు (Simbu) సాయంతో కోలీవుడ్ హీరోలలో మార్పు వచ్చి అండగా నిలుస్తారేమో చూడాలి. కోలీవుడ్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై సంచలన విజయం సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. శింబును తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రశంసిస్తున్నారు. శింబు ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

శింబు (Simbu) పారితోషికం పరిమితంగానే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శింబు భవిష్యత్తు సినిమాలను తెలుగులో సైతం రిలీజ్ చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శింబు గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా ఇప్పుడు మాత్రం వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి శింబుతో పోల్చి చూస్తే తమిళంలో చాలామంది స్టార్స్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

శింబు మాత్రం సాయం విషయంలో తాను గొప్ప అని ప్రూవ్ చేసుకున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై శింబు ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు చాలామంది హీరోయిన్లు సరైన విధంగా స్పందించకపోవడం గురించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనన్య నగళ్ల  (Ananya Nagalla)  , నిహారిక (Niharika) , స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu) మినహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు విరాళం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.

షార్క్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus