‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రూపొందిన చిత్రం ‘దేవర’ (Devara) . 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా చేసిన హీరో.. నెక్స్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ‘ఆచార్య’ (Acharya) తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). తిరిగి ‘దేవర’ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తంగా ‘దేవర’ పై పెద్ద బాధ్యత ఉంది.
సో ఫలితం ఏమవుతుంది అనేది సెప్టెంబర్ 27న తెలుస్తుంది. మరోపక్క రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ (Devara).. మొదటి భాగం ‘దేవర పార్ట్ 1’ హిట్ అయితేనే రెండో పార్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘దేవర'(పార్ట్ 1) ట్రైలర్ బయటకు వచ్చింది. ఎందుకో ‘ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు’ అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా చూశాక కానీ.. సినిమా ఫలితం పై ఓ అంచనాకు రావడం అనేది కరెక్ట్ కాదు.
సో ట్రైలర్లోని లోపాలను పక్కన పెట్టేస్తే.. ‘దేవర’ (Devara) పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని ట్రైలర్ చెబుతుంది. కానీ ‘దేవర’ బ్రతికున్నాడా.. చనిపోయాడా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క ట్రైలర్లోని చాలా విజువల్స్ మొదటి భాగంలో కనిపించవు అనేది ఇన్సైడ్ టాక్. ‘దేవర’ పాత్ర ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. సో చాలా విజువల్స్ ఫస్ట్ పార్ట్ లో మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ దర్శకుడు ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ..లా రివర్స్ స్క్రీన్ ప్లే చేసాడేమో అనే డౌట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సెప్టెంబర్ 27 నే సమాధానం దొరుకుతుంది.