Balakrishna: ఆ విషయంలో బాలయ్య మిగతా హీరోలకు ఆదర్శంగా నిలవనున్నారా?

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. బాలయ్య వరుస సక్సెస్ లకు కారణమేంటనే ప్రశ్నకు వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవడం, డైలాగ్స్ అద్భుతంగా ఉండేలా చూసుకోవడం, కథ వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడటం, వీటిని మించి బాలయ్య అద్భుతమైన నటన వల్ల వరుస విజయాలు దక్కాయని తెలుస్తోంది. బాలయ్యను ఫాలో అయితే ఇతర హీరోలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సరైన పాత్రలను ఎంపిక చేసుకుని సక్సెస్ సాధించే విషయంలో బాలయ్య మిగతా హీరోలకు ఆదర్శంగా నిలవనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మిగతా హీరోలు సైతం తమలోని ప్లస్ పాయింట్లను గుర్తించి కెరీర్ పరంగా ముందడుగులు వేస్తే సక్సెస్ సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ నవంబర్ నెల నుంచి మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అటు బాలయ్యకు, ఇటు బాబీకి ఈ సినిమా కీలకం కానుంది. సక్సెస్ ట్రాక్ లో ఉన్న బాలయ్య, బాబీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య, బాబీ రెమ్యునరేషన్లు సైతం భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది. సితార నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య తర్వాత ప్రాజెక్టుల గురించి త్వరలో మరిన్ని ప్రకటనలు రానున్నాయని సమాచారం. బాలయ్య సినిమాలలో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బాలయ్యకు (Balakrishna) ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ బేస్ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news