Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) షూటింగ్లో గాయ్పడ్డారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరి నెక్స్ట్ మూవీపై కూడా మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది. ‘ఎన్ బి కె 111’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది.

Nandamuri Balakrishna

ఇందులో భాగంగా చిత్రీకరిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్..లో బాలకృష్ణ కాలు జారిపడటంతో ఆయన మోకాలికి బలమైన గాయం అయ్యింది. దీంతో వెంటనే ఆయన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం స్కానింగ్ వంటి వైధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. స్కానింగ్ రిపోర్ట్ చూశాక సర్జెరీ అవసరం అని వైద్యులు సూచించారట. అయితే సెకండ్ ఛాన్స్ లో భాగంగా.. ఫుల్ బాడీ స్కాన్ నిర్వహించి ఫైనల్ కాల్ ఇచ్చేందుకు వైద్యులు డిసైడ్ అయ్యారట.

దర్శకుడు గోపీచంద్ మలినేని.. బాలకృష్ణకి గాయమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ‘ఎన్ బి కె 111’ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా గోపీచంద్ మలినేని తెలిపినట్టు సమాచారం. ఇక గోపిచంద్ మలినేని ట్వీట్ చూసి విషయం తెలుసుకున్న.. సెలబ్రిటీలు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం.. ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’ అంటూ ట్వీట్లు వేశారు.

బాలకృష్ణ షూటింగ్లో గాయపడటం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఆయనకి ప్రమాదాలు జరగడం.. మొండి పట్టుదలతో ఆయన త్వరగా కోలుకోవడం జరిగింది.

వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus