బాలయ్య ‘మార్కెట్’ కేక పుట్టిస్తుంది!!!

నందమూరి నట సింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు అంటే చాలు…ఎంతటి మగధీరులైనా పక్కకు తప్పుకోవాల్సిందే అనేది చరిత్ర చెబుతున్న సత్యం. గతాన్నే తీసుకుంటే దాదాపుగా 18సార్లు బాలయ్యతో బరిలో నిలిచాడు మన మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ బాక్స్ ఆఫీస్ యుద్దంలో ఇప్పటికీ బాలయ్యనే పై చెయ్యి సాధించాడు అని బాక్స్ ఆఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 2017సంక్రాంతికి బాలయ్యతో మిగిలిన ముగ్గురు హీరోలు పోటీ పదే అవకాశం ఉండడం ఒక లెక్క అయితే….మరో పక్క చారిత్రాత్మక సినిమాతో వస్తున్న బాలయ్య “గౌతామీపుత్ర శాతకర్ణి” బిజినెస్ చూస్తుంటే మిగిలిన హీరోలకే కాదు…అటు మెగా హీరోలకు కూడా టెన్షన్ పట్టుకుంది…అసలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మెగా వర్గాలు.

అదే క్రమంలో గత సంవత్సరం ‘రుద్రమదేవి’ సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే వచ్చిన కలక్షన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఏమి ఆలోచించి అంత భారీ మొత్తాలు బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి బయ్యర్లు ఆఫర్ చేస్తున్నారో అర్ధం కాని ఫజిల్ గా మారిందని మెగా కాంపౌండ్ వర్గాలు ఆలోచనలో పడ్డారు. ఇక అదంతా పక్కన పెడితే….చిరు 150 సినిమా పేరు చెబుటె చాలు బయ్యర్స్ బాబోయ్ అంటూ పారిపోతున్నారు…ఎందుకంటే ఆ సినిమా రేట్ అంత దారుణంగా ఉంది…అంత భారీ మొత్తాన్ని పెట్టి సినిమా కొన్న తరువాత ఏమైనా తేడా వస్తే అంతా అస్సామే అని భయపడుతున్నాడు బయ్యర్స్. మరి చూడాలి ఈ బాక్స్ ఆఫీస్ రేస్ లో ఎవరు హీరోగా నిలుస్తారో.

Balakrishna's Rythu Gets launch date - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus