NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు హోల్డ్‌లో ఉంది. బాలకృష్ణకు ఇటీవల శస్త్రచికిత్స జరగడమే దీనికి కారణం. సినిమ చిత్రీకరణలో గాయపడటంతో ఆ సర్జరీ చేశారు. మోకాలికి జరిగిన ఆ సర్జరీ నుండి ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారట. అయితే ఈ గ్యాప్‌ కారణంగా సినిమా రిలీజ్‌పై ప్రభావం ఉండకూడదు అని బాలయ్య ఫిక్స్‌ అయ్యారట.

NBK 111

అంటే.. ముందుగా అనుకున్న ప్లానింగ్‌ ప్రకారమే సినిమాను రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అంతే కాదు ఈ మేరకు ప్రచారం కూడా షురూ చేయాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ నెల 6న సినిమా పేరు, విడుదల తేదీని అనౌన్స్‌ చేస్తారట. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక సమాచారం విషయానికొస్తే… డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. రిలీజ్‌ డేట్‌ కూడా రెండు లేదా మూడో వారంలో ఉంటుంది అని చెబుతున్నారు.

ముంబయి నేపథ్యంలో యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ‘గాడ్’ ఒక టైటిల్‌ కాగా.. రెండోది ‘దాదా’ అని చెబుతున్నారు. వీటిలో ఏది బాగుంటుందనేది నిర్ణయం తీసుకొని త్వరలో అధికారికంగా అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు. ఈ నెల నుండి షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలా సినిమా స్టార్ట్ అయిన సందర్భంలో సినిమా టైటిల్‌తో ఓ టీజర్‌ను అనౌన్స్‌ చేస్తారు అని గతంలో వార్తలు వచ్చాయి. అది మొదటి వారం అని ఇప్పుడు చిత్రబృందం సమాచారంతో తేలింది.

ఈ సినిమా పేరు చూస్తే.. రీసెంట్‌గా తెలుగులో రెండు పెద్ద సినిమాలకు పెట్టిన టైటిళ్లకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ‘ఓజి’ అని పేరు పెట్టగా. అల్లు అర్జున్ ‘రాకా’ అని పేరు పెట్టారు. ఇక చిరంజీవి ‘కాకా’గా రాబోతున్నారు. దీంతో బాలయ్య సినిమాకు పెడతారు అంటున్న ‘గాడ్’ లేదా ‘దాదా’ అని పెడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా డిసెంబరు మూడో వారంలో వస్తే నాగార్జున ‘కింగ్‌ 100’తో క్లాష్‌ ఉంటుంది.

‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus