NBK 107 బాలయ్య పవర్ఫుల్ లుక్ అదిరింది!

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ వస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు అంతకు మించిన మరొక విజయాన్ని అందుకోవాలని సినిమాలు చేస్తున్నాడు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని కూడా తన స్థాయిని మరింత పెంచుకోవాలని బాలయ్య సినిమాను లైన్ లో పెట్టాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Click Here To Watch

ఇటీవల నందమూరి బాలకృష్ణ పాత్ర కు సంబంధించిన ఒక పాత్ర కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ఆ క్యారెక్టర్ కు సంబంధించిన ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ నల్లని చొక్కాలో లో ఊర మాస్ పాత్రలో చాలా వైల్డ్ గా కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఈ కథ కోసం గోపీచంద్ రాయలసీమ ఏరియాలలో కొన్ని పాత సంఘటనలపై కూడా రీసెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది.. అంతే కాకుండా ఇది ఒక కన్నడ సినిమాకు రీమేక్ అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఇంతవరకు ఆ కథనాలపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో లీకైన ఒక ఫోటో కు మంచి రెస్పాన్స్ రావడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని అభిమానుల కోరిక మేరకు పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశాడు.

ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అవుతుంది. మరి బాలకృష్ణ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus