తింటే గారెలు తినాలి వింటే ఎన్టీవోడి డైలాగులు వినాలని నాటి జనరేషన్ తెలుగు ప్రేక్షకుడు అనుకునేవాడు. తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నందమూరి తారక రామారావు చేయని పౌరాణిక పాత్ర అంటూ బహుశా ఏదీ మిలిగి ఉండదు. ఎన్టీఆర్ డైలాగు చెబితే ఎలా ఉంటుందో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు.
క్లిష్టమైన సమాసాలున్నా కష్టమైన సంస్కృత పదాలున్నా లెంగ్త్ ఎన్ని పేజీలున్నా సింగిల్ టేక్ లో అనర్గళంగా డైలాగులు చెప్పేయడం అన్నగారికే సాధ్యం! ఇక నేటితరం టాప్ హీరోల విషయానికొస్తే భారీ డైలాగులు అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలయ్యే.