Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో బాలయ్యకు ‘సింహ’ లాంటి బ్లాక్‌బస్టర్ కథను అందించారు కొరటాల శివ. ఇప్పుడు ఆయన్నే హీరోగా పెట్టి ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు.

Balakrishna, Koratala Siva

కొరటాల శివ సినిమా అంటేనే కమర్షియల్ హంగులతో పాటు ఓ బలమైన సామాజిక సందేశం కచ్చితంగా ఉంటుంది. దానికి బాలయ్య ఊరమాస్ ఇమేజ్ తోడైతే ఎలా ఉంటుందో.. ఈ ప్రాజెక్ట్ సరిగ్గా అలాగే ఉండబోతోందట. రీసెంట్‌గా జరిగిన ఫస్ట్ సిట్టింగ్‌లోనే కొరటాల చెప్పిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా బాలయ్యకు విపరీతంగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ మూవీ కోసం బాలకృష్ణ మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త లుక్‌ను డిజైన్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

ఇక ఈ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి బరిలో దిగబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. పక్కా ప్లానింగ్‌తో సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై వచ్చే నెలలో (మే) అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల.. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గుమ్మడికాయ కొట్టేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.2027 సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.అతి త్వరలోనే మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ వెల్లడించనున్నారు.

సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus