MAA elections: ఎన్నికల్లో నటసింహం మద్దతు ఎవరికో తెలుసా..?

Advertisement

గతంలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు భిన్నంగా ఈ ఏడాది జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుల మధ్య పోటీ ఉండనుందని తెలుస్తోంది. మా అధ్యక్షుడి స్థానం కోసం పోటీ చేసే సెలబ్రిటీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ అధ్యక్షుడి స్థానం కోసం పోటీకి సిద్ధమవడంతో వీళ్లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెటిజన్లలో నెలకొంది. మరోవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు,

100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలు ఎవరికి మద్దతు తెలుపుతారనే ప్రశ్న వినిపిస్తోంది. చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికారికంగా మాత్రం ఈ మేరకు ప్రకటన వెలువడలేదు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ కే తన మద్దతు ప్రకటించారు. మంచు మోహన్ బాబు ఆశీర్వాదంతో మంచు విష్ణు పోటీలోకి దిగగా కృష్ణ, కృష్ణంరాజు మద్దతు విష్ణుకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ జీవితకు మద్దతు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే బాలయ్య ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు స్టార్ హీరోలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తారా..? రారా..? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల వల్ల టాలీవుడ్ నాలుగు వర్గాలుగా చీలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష పదవికి విన్నర్ గా నిలుస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus