బోయపాటిని ఇబ్బంది పెడుతున్న బాలయ్య..!

  • June 13, 2020 / 02:00 PM IST

‘బాలయ్య.. డైరెక్టర్ ఏం చెబితే అది.. గుడ్డిగా చేసేస్తాడు.’ఇలా ఎందుకు చేస్తున్నారు’ అని ఒక్క ప్రశ్న కూడా డైరెక్టర్ కు వెయ్యడు. ఆయన ఎంతో గొప్ప నటుడు’.. అంటూ నందమూరి బాలకృష్ణ గురించి ఎంతో మంది దర్శకులు చెబుతుంటారు. అయితే గతేడాది నుండీ బాలయ్యలో కూడా మార్పు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల విషయంలో బాలయ్య .. ఆ చిత్రం దర్శకుడు క్రిష్ తో ఎన్నో మార్పులు చేయించాడట.

అయినప్పటికీ ఆ చిత్రాలు హిట్ అవ్వలేదు. అయితే అదే ఏడాది చివర్లో వచ్చిన ‘రూలర్’ చిత్రం విషయంలో మాత్రం బాలయ్య ఏమీ డైరెక్టర్ ను ప్రశ్నించలేదట. అయితే ఇప్పుడు బోయపాటి సినిమా విషయంలో మాత్రం బాలయ్య ఎక్కువ మార్పులు కోరుతున్నట్టు తెలుస్తుంది. గతంలో దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబినేషన్లో రాబోతున్న తరువాతి చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అందుకు తగినట్టే టీజర్ కూడా అదిరిపోయింది. యూట్యూబ్ కి ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది. అయితే గతేడాది బోయపాటి కూడా ‘ వినయ విధేయ రామ’ చిత్రంతో డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. అందుకే బాలయ్య … బోయపాటి పై ఓ కన్నేసి ఉంచాడట. అనవసరం అనుకున్న సీన్లు దగ్గరుండి మరీ తీయించేస్తున్నాడట. ‘దీంతో బాలయ్య కూడా ఇలా తయారయ్యాడేంటి’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తుండడం గమనార్హం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus