Balakrishna: ఆ మూవీలో బాలయ్య సాధువు రోల్ లో కనిపించనున్నారా?

  • March 4, 2024 / 02:25 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య సినిమా సినిమాకు కథ విషయంలో కొత్తదనం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలకు ఓటేస్తున్న బాలయ్య ఆ సినిమాలతో భారీ విజయాలు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ2 సినిమాలో బాలయ్య అఘోరా లుక్ తో పాటు సాధువు లుక్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య సాధువు లుక్ లో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండ2 లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అక్టోబర్ నుంచి ఈ సినిమా షూట్ జరగనుందని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు భాషతో సంబంధం భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్న నేపథ్యంలో బాలయ్య అఖండ2 కూడా భారీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

సాధువు పాత్ర 25 నిమిషాలు ఉంటుందని సమాచారం. వైరల్ అవుతున్న వార్తల గురించి బోయపాటి శ్రీను నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్య బోయపాటి శ్రీను భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. బోయపాటి శ్రీను సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

స్కంద సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని ప్రచారం జరుగుతోంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీకి నిర్మాత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బాలయ్య (Balakrishna)  బోయపాటి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus