Balakrishna: బాలయ్య భార్య సెంటిమెంట్ గురించి తెలుసా.. అసలేం జరిగిందంటే?

  • August 5, 2023 / 08:32 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా భగవంత్ కేసరి, బాలయ్య బాబీ కాంబో మూవీ, బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు భావిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి బాక్సాఫీస్ ను షేక్ చేయగా భగవంత్ కేసరి కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలయ్య భార్య వసుంధర గురించి బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బాలయ్య బాబు భార్య హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆమె ఇచ్చిన డబ్బులతో ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుందని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. ఆమె చేతి నుంచి డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని ఆమెది గోల్డెన్ హ్యాండ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పిల్లల్ని పెంచడంలో వసుంధర కీలక పాత్ర పోషించారు.

బాలయ్యతో (Balakrishna) సినిమాలు తీసుకునే ప్రొడ్యూసర్స్ లో కొంతమంది వసుంధర చేతుల మీదుగా డబ్బులు తీసుకుని సినిమాను మొదలుపెడతారని ఈ విధంగా చేయడం వల్ల తమ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని వాళ్లు నమ్ముతారని తెలుస్తోంది. బాలయ్య సక్సెస్ వెనుక వసుంధర ఉన్నారని చాలామంది భావిస్తారు. బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కాగా బాలయ్యకు హిట్ ఇచ్చి దర్శకునిగా బి.గోపాల్ రిటైర్ కానున్నారు. సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus