Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Nippu Ravva: బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ మళ్లీ సిద్ధం… అయితే ఈసారి నిజ జీవితం!

Nippu Ravva: బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ మళ్లీ సిద్ధం… అయితే ఈసారి నిజ జీవితం!

  • September 7, 2023 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nippu Ravva: బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ మళ్లీ సిద్ధం… అయితే ఈసారి నిజ జీవితం!

నిజ జీవిత కథల్ని సినిమాలుగా తీయమంటే బాలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా – లాక్‌డౌన్‌ తర్వాతి పరిస్థితుల నేపథ్యంలో కాస్త స్లో అయ్యింది కానీ… ఈ రెండేళ్ల కాలంలో ఇంకెన్ని జీవిత కథలు వచ్చేవో. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌ విజయాలతో కళకళాడుతోంది. ఈ క్రమంలోనే జీవిత కథలు, నిజ జీవిత సంఘటనల నేపథ్య చిత్రాలు పెరుగుతున్నాయి. అలా ‘నిప్పురవ్వ’ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్తోంది. ఏంటీ బాలకృష్ణ ‘నిప్పురవ్వ’నా అంటారా? అవును అయితే అందులోని కీలక అంశం మాత్రమే.

‘నిప్పు రవ్వ’ (Nippu Ravva) సినిమా ఇప్పటి తరం సినీ గోయర్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పటి ఫేమస్‌ డిజాస్టర్‌ అది. బాలయ్య కెరీర్‌లో భారీ అంచనాలతో వచ్చి దారుణ పరాజయం పాలైంది. అయితే ఆ సినిమాలో ఓ సీన్‌ మాత్రం హీరోయిక్‌గా, అదిరిపోతుంది. అదే బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించే సన్నివేశం. ఇప్పుడు ఈ సన్నివేశం గురించి ఎందుకు చర్చ జరుగుతోంది అంటే.. ఆ సన్నివేశం ఓ నిజ జీవిత ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తీశారు కాబట్టి.

ఆ నిజ జీవిత సంఘటలను ఇప్పుడు సినిమాగా తీశారు. అంతేకాదు ఆ సినిమా విడుదలకు కూడా సిద్ధమైంది. ఇటీవల ‘ఓఎంజీ 2’తో మంచి విజయం అందుకున్న అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమా చేశారు. టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వంలో ‘మిషన్‌ రాణిగంజ్‌’ పేరుతో ఈ సినిమా రూపొందింది. బొగ్గు గనిలో రెస్క్యూ ఆపరేషన్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1989లో ‘రాణిగంజ్‌’ బొగ్గు గనుల్లో మైనింగ్‌ వర్క్‌ జరుగుతుండగా, ఒక్కసారిగా లోపలకు నీళ్లు వచ్చేశాయి.

మైనింగ్‌ ఇంజినీర్‌ అయిన జస్వంత్‌సింగ్‌ గిల్‌ (అక్షయ్‌ కుమార్‌), పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అమర్‌ జోషి… తమ ప్రాణాలను పణంగా పెట్టి, కార్మికులను కాపాడిన విధానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ‘రాణిగంజ్‌’ బొగ్గు గని ప్రమాద సమయంలో 220 మంది కార్మికులు రాత్రి విధుల్లో ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే 149 మంది బయటకు రాగా, మరో 64 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఒక వ్యక్తి దాదాపు 36 గంటల తర్వాత ఈదుకుంటూ బయటకు రావడం గమనార్హం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nippu Ravva

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

3 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

3 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

4 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

4 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

4 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

10 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

11 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version