బిగ్ బాస్ తెలుగు సీజన్ – 7 స్టార్ట్ అయ్యింది. అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయిపోయాయి. మొదటి రోజే చాలా మిస్టేక్స్ జరిగాయంటూ కొన్ని పాయింట్స్ ని చెప్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అసలు ఇంత జాగ్రత్తలు తీస్కున్నా , ఈసారి సీజన్ అన్ని సీజన్స్ కంటే గొప్పగా ఉంటుందని చెప్పినా మిస్టేక్స్ ఎలా జరగాయనేది మాత్రం అంతుచిక్కడం లేదు. అసలు ఆ మిస్టేక్స్ ఏంటనేది ఒక్క లుక్కేద్దామా..
నెంబర్ – 1
ఈసారి ఫస్ట్ ఎపిసోడ్ లో ఎక్కడా కూడా బిగ్ బాస్ వాయిస్ అనేది వినిపించలేదు. ఫస్ట్ బిగ్ బాస్ వాయిస్ వినిపించాకే అన్ని సీజన్స్ స్టార్ట్ అయ్యాయి. కనీసం పార్టిసిపెంట్స్ ని కూడా బిగ్ బాస్ పలకరించలేదు. ఇంది కంప్లీట్ గా మిస్ అయ్యిందని చెప్తున్నారు ఆడియన్స్
నెంబర్ – 2
బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ 5గురు రాగానే ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సిల్వర్ బ్రీఫ్ కేస్ ని చూపించి అందులో క్యాష్ ఉందని అది తీస్కుని వెళ్లిపోవచ్చని చెప్పాడు. అంతేకాదు, క్యాష్ ప్రైజ్ మనీ పెంచుతూ అందులో 35 లక్షలు ఉన్నాయని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా తీస్కుని వెళ్లి ఉంటే అది విన్నర్ ప్రైజ్ మనీలో కోత పడుతుందా లేదా అనేది చెప్పలేదు. అంతేకాదు, అసలు తీస్కుని వెళ్లి ఉంటే ఏం జరిగేదని కనీసం లాస్ట్ లో కూడా చెప్పలేదు.
నెంబర్ – 3
ఫస్ట్ హౌస్ మేట్ హౌస్ లోకి వచ్చేటపుడు సిల్వర్ బ్రీఫ్ కేస్ ని దాచాలాని అది వచ్చే పార్టిసిపెంట్స్ కి కనిపించకూడదని రూల్స్ చెప్పారు. కానీ, ఆ తర్వాత వచ్చే పార్టిసిపెంట్స్ కి ఈ బ్రీఫ్ కేస్ వెతకమని చెప్పడం యాంకర్ నాగార్జున మిస్ అయ్యారు. దీంతో ఆ టాస్క్ బిస్కెట్ అయిపోయింది.
నెంబర్ – 4
ఉల్టా పుల్టా సీజన్ అంటూ ఏదో చేయబోయి ఏదో చేసినట్లుగా అయ్యింది. మొదటి వారం 14మంది పార్టిసిపెంట్స్ మళ్లీ వచ్చేవారం మరికొంత మంది పార్టిసిపెంట్స్ వస్తే ఒకవారం ఇమ్యూనిటీ వాళ్లకి లభించినట్లే కదా.. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు.
నెంబర్ – 5
విజయ్ దేవరకొండలాంటి సెలబ్రిటీని హౌస్ లోకి పంపించి టాస్క్ ఆడించేటపుడు క్లారిటీ మిస్ అయ్యింది. ఎవరు సిన్సియర్ గా ఎఫోర్ట్స్ పెట్టారు అనేది క్లియర్ గా చూపించలేకపోయారు. బిట్స్ గా చూపించేసరికి అందులో లోపాలు కనిపించాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ఏదో ఒకరిని సెలక్ట్ చేయాలి కదా అని శుభశ్రీని సెలక్ట్ చేసినట్లుగా ఉంది.
ఇలా ఫస్ట్ డే ఎపిసోడ్ లో (Bigg Boss 7 Telugu) చాలా మిస్టేక్స్ ఉన్నాయి. షో డిజైన్ చేసేటపుడు – టాస్క్ లు ఆడించేటపుడు క్లారిటీ ఉండాలి కదా.. నాగార్జున గారు మీరు చూస్కోవాలి కదా సార్ అని ఆడియన్స్ ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అదీ విషయం.