టాలీవుడ్ ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడినప్పుడు యువ హీరోల గురించి ఎక్కువగా వింటుంటాం. అయితే సీనియర్ స్టార్ హీరోల విషయంలో ఈ పరిస్థితి తక్కువే. కానీ ఇటీవల కాలంలో అది కూడా మారింది. సీనియర్ అగ్ర హీరోలు కూడా తమ మధ్య మంచి స్నేహం ఉందని మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపిస్తున్నారు. అలా ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వెంకటేశ్ (Venkatesh) – బాలకృష్ణ (Balakrishna) మధ్య ఇలాంటిదే జరిగింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు.
అంటే ఇంకా సినిమా టైటిల్ ఖరారు చేయలేదు అనుకోండి. కానీ ఇదే ఫిక్స్ అంటున్నారు. ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమా సెట్‌లో ఇటీవల జరిగిన ఓ సరదా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సినిమా టీమ్ రిలీజ్ చేసింది. వైరల్‌గా మారిన ఆ ఫొటోల్లో నందమూరి బాలకృష్ణ ఉండటం గమనార్హం. ప్రస్తుతం వెంకీ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడితో కలసి కాసేపు సరదాగా మాట్లాడారు.
అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బాలయ్య ఎందుకు సెట్‌లోకి వచ్చాడు అనేది టీమ్ చెప్పలేదు. అయితే, ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఆర్‌ఎఫ్‌సీలోనే జరుగుతున్నాయి. దానికితోడు బాలయ్యతో అనిల్ రావిపూడి గతంలో ఓ సినిమా చేశారు. ఎలాగూ వెంకీతో బాలయ్యకు మంచి అనుబంధమే ఉంది. అందుకే బాలయ్య వచ్చాడు అని చెప్పాలి. ఇక ‘ఎఫ్ 2’(F2 Movie) , ‘ఎఫ్ 3’ (F3 Movie) తర్వాత వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది.
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కథానాయికలుగా నటిస్తున్నారు. క్రైమ్ డ్రామా విత్ ఫ్యామిలీ ట్విస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందంటున్న ఈ సినిమాలో వెంకీ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తాడు. ఎక్స్‌లెంట్ వైఫ్‌గా ఐశ్వర్య నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా కనిపించనుంది. ఇక బాలయ్య.. బాబీ (Bobby) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.