Nani: న్యాచురల్ స్టార్ నాని ఆ రికార్డ్ ను మళ్లీ అందుకుంటారా?

  • September 21, 2024 / 07:37 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిడిల్ రేంజ్ హీరోలలో నానికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. న్యాచురల్ స్టార్ నాని (Nani)  దసరా (Dasara),, హాయ్ నాన్న (Hi Nanna) , సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. గతంలో నాని వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయి. నాని వచ్చే ఏడాది హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Nani

ఈ సినిమాతో పాటు నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా సినిమాకు 100 రెట్లు అనే రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న నాని టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లకు సైతం ఛాన్స్ ఇస్తున్నారు. హిట్3 సినిమా కూడా సక్సెస్ సాధిస్తే నాని అడుగులు డబుల్ హ్యాట్రిక్ దిశగా పడినట్టేనని చెప్పవచ్చు.

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకవైపు వేగంగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వరుస విజయాలను సొంతం చేసుకోవడం నానికి మాత్రమే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ హిట్లను సైతం అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్న నాని మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను ఎంపిక చేసుకోవడం ద్వారా సక్సెస్ సాధిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాని పారితోషికం 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. వరుస విజయాలు నాని రేంజ్ ను ఎంతగానో పెంచేశాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాని భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు సైతం భారీ స్థాయిలో ఉండనున్నాయని తెలుస్తోంది.

 గోవాలో.. అంత వేడిలో.. ‘దేవర’ కష్టాలు చెప్పిన తారక్‌.. వామ్మో అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus