బాలకృష్ణుడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ సంయుక్తంగా నారా రోహిత్‌-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బాల‌కృష్ణుడు`. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్ శ్రీ వినోద్ నంద‌మూరి, మాయా బ‌జార్ మూవీస్ సినిమా నిర్మాత‌లు. ఇటీవల విడుదలైన సినిమా ఫ‌స్ట్‌లుక్‌ కు విశేషమైన స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా రోహిత్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ – “నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా `బాల‌కృష్ణుడు` యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈనెల 10వ తారీఖున ఘనంగా ఆడియో వేడుక నిర్వహించనున్నాం. అలాగే నవంబర్ 24న చిత్రాన్ని విడుదల చేయనున్నాం” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus