సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బాలయ్య డ్యాన్స్ వీడియో..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఈ మధ్యే ‘రూలర్’ చిత్రానికి సంబందించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. బాలయ్య పబ్లిక్ కార్యక్రమాలలో ఎప్పుడూ చురుకుగా పాల్గొంటుంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రసంగాలతో కాస్త విమర్శలని ఎదుర్కొంటున్నప్పటికీ.. డాన్సులతో, పాటలతో మాత్రం అలరిస్తూనే ఉంటుంటాడు.

Bala Krishna latest Dance

తాజాగా బాలయ్య ఓ పబ్లిక్ ఈవెంట్ లో డ్యాన్స్ తో ఇరక్కొట్టేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మాస్ బీట్ సాంగ్ కి స్టెప్స్ వేసి అక్కడి జనాలతో క్లాప్స్ కొట్టించుకున్నారు. ఈ స్టెప్స్ కు చుట్టూ ఉన్న.. జనాలు ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’ చిత్రంలోని ఓ మాస్ పాటకి బాలయ్య స్టెప్స్ వేసి ఈ పాటను మరింత వైరల్ చేసాడు. ఈ వీడియో ని మీరు కూడా ఓ లుక్ ఎయ్యండి.


ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus