Balayya Babu: ఐ డోంట్ కేర్‌… ఇప్పుడు ఇదీ.. నందమూరి కుటుంబంలో గ్యాప్ పెరుగుతోందా?

  • November 14, 2023 / 03:45 PM IST

బాలకృష్ణను భోళా శంకరుడు అంటారు. మనసులో ఏముందో ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా మాట్లాడేస్తారు అని అంటారు. అయితే ఆయన మాట్లాడటం వల్ల బయట వాళ్ల విషయంలో ఎఫెక్ట్‌ అయితే ఒక లెక్క కానీ, సొంత కుటుంబంలో ఇబ్బంది వస్తే కష్టం. ఇప్పుడు బాలయ్య మాట్లాడిన రెండు మాటలు కుటుంబంలో గ్యాప్‌ను పెంచుతున్నాయి అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మొన్నామధ్య నారా చంద్రబాబు నాయుడు విషయంలో మాట్లాడితే, ఇప్పుడు ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు అయిన తర్వాత ఎన్టీఆర్‌ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అనే విషయంలో ఎవరి వాదనలు వారివి. అయితే దాని గురించి మీడియా ప్రస్తావిస్తే ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ఎందుకిలా అన్నాడు అనే కామెంట్స్‌ వచ్చాయి. ఆ సంగతే ఇంకా తేలడం లేదు అనుకుంటే తాజాగా చేసిన కొత్త కామెంట్‌ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.

నందమూరి బాలకృష్ణ (Balayya Babu) హీరోగా నటించిన ‘భగవంత్‌ కేసరి’ సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ని ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ‘బాబాయ్‌ అంటే వాళ్లకి దబిడి దిబిడే’ అని అన్నాడు. ఆయన ఏ కారణంతో, ఏ ఇంటెన్షన్‌తో అన్నాడో తెలియదు కానీ.. నెటిజన్లు అయితే తారక్‌ను ఉద్దేశించే అన్నాడు అని అంటున్నారు. తారక్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ఇలా అన్నాడు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

దీంతో బాలయ్య ఫ్యాన్స్‌కి, తారక్‌ ఫ్యాన్స్‌కి మధ్య ఒక రకమైన వార్‌ జరుగుతోంది. దీంతో అంతా ఓకే అనుకుంటున్న నందమూరి కుటుంబంలో లేనిపోని డిస్కషన్‌లు జరుగుతున్నాయి. అదేంటి ఫ్యాన్స్‌ మధ్య కదా అంటారా? ఫ్యాన్స్‌ని కూడా హీరోలు తమ కుటుంబంలో భాగంగా చూస్తారు కదా. అందుకే అయితే మరి నిజంగా బాలయ్య మాటలు సొంత కుటుంబంలో కూడా ఇబ్బందులకు కారణం అవుతాయా అనే డౌట్‌ కూడా ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus