బాలయ్య అస్సలు తగ్గడం లేదుగా.. మళ్ళీ చిరు పైనే వేసేశాడు..!

  • June 11, 2020 / 07:06 PM IST

నిన్న బాలయ్య 60వ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగానే జరిగాయి. అభిమానులను కూడా ఎటువంటి హడావిడి చెయ్యొద్దని బాలయ్య కోరాడు. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించవద్దు అని కూడా బాలయ్య కోరడంతో వారు బాలయ్య మాటను సాధించి సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ లేని విధంగా బాలయ్య ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ సెలబ్రిటీలు అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపాడు. అంతేకాదు ఇండైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి పై కొన్ని సెటైర్లు కూడా వేసాడు.

బాలయ్య మాట్లాడుతూ.. “నా అభిమానులు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. వారి కోసం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తాను.నా పుట్టినరోజు సందర్భంగా.. నాకు విషెస్ చెప్పిన ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ ప్రముఖులందరికీ థ్యాంక్స్. ఈసారి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని వారు కూడా నాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ఇండస్ట్రీ మీటింగ్స్ కు నన్ను పిలవకపోయినా ఏమీ కాదు.. కానీ ఇప్పుడు పిలవాల్సిన అవసరం ఉంది. మర్యాద ఇచ్చి.. మర్యాద పుచ్చుకోవాలి.

నా అభిమానులంతా ఎవరిళ్లలో వారు కేకులు కట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో నేను చేస్తున్న చిత్రం టీజర్ కు కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత రెట్టింపు వేగంతో చిత్రీకరణ పూర్తి చేస్తాము” అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యని వ్యక్తులు అని బాలయ్య ఇండైరెక్ట్ గా చిరుని ఉద్దేశించే చేసాడు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus