Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్ చేస్తారా? ఇక కనిపించడా?
- May 26, 2026 / 07:23 PM ISTByFilmy Focus Desk
నటుల్ని బ్యాన్ చేస్తారా? గత రెండు రోజులుగా ఇండియన్ సినిమాలో, సినిమా నేపథ్య సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. దానికి కారణం ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్‌ను నటీనటుల సంఘం బ్యాన్ చేయడమే. అవును మీరు చదివింది కరెక్టే. ‘ధురంధర్’ సినిమాలతో దేశంలో టాప్ హీరోల జాబితాలో చేరిన రణ్‌వీర్ ఇప్పుడు నిషేధానికి గురయ్యాడు. దానికి కారణం ‘డాన్ 3’ సినిమా.
Ranveer Singh
గత కొన్ని రోజులు నానుతూ వస్తున్న ‘డాన్ 3’ సినిమా వివాదం ఇప్పుడు ముదిరింది. హీరోపై బ్యాన్ విధించే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణ్‌వీర్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. మూడేళ్ల క్రితం నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన ఫరాన్ అక్తర్.. రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమాను ప్రకటించాడు. అప్పటికే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ చేసిన పాత్ర కావడంతో మూడో ‘డాన్’ ఎలా ఉంటాడా అనే ఆతృత అందరిలోనూ కలిగింది.

అయితే సినిమా తీయడంలో ఆలస్యం కావడం, స్క్రిప్ట్‌లో సమస్యలు రావడంతో ఈ సినిమా నుండి రణ్‌వీర్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. డాన్ పాత్రను మరింత యాక్షన్ టచ్‌తో క్రియేట్ చేయమని రణ్‌వీర్ కోరాడని.. దానికి ఫరాన్ నో చెప్పడంతోనే ఈ పరిస్థితి మొదలైందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో సినిమా ఆలస్యం కావడం కూడా ఓ కారణమని చెబుతున్నారు.
ఈ సినిమా నుండి తప్పుకుంటున్నందుకు ఫరాన్‌కు రణ్‌వీర్ రూ.10 కోట్లు ఇస్తానని చెప్పాడని బీటౌన్ వర్గాల మాట. అయితే రూ.45 కోట్ల నష్టపరిహారం కోరుతూ రణ్‌వీర్‌పై ఫరాన్ ప్రొడక్షన్ హౌస్ లీగల్ నోటీసు పంపిందట. ఈ పరిణామాల నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ రణ్‌వీరపై మూడేళ్ల నిషేధం విధించింది.
బ్యాన్ వేశారు కాబట్టి.. ఇప్పుడు రణ్‌వీర్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నిషేధం ప్రభుత్వం విధించినది కాకపోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు అని చెబుతున్నారు. మరి ఇలాంటి ఇబ్బందులు పెద్దవి కాకుండా రణ్‌వీర్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.










