Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్ రిక్వెస్ట్.. ఏమైందంటే?
- May 26, 2026 / 07:18 PM ISTByFilmy Focus Desk
తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి అని కోరుతూ ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. తన తండ్రితో కలసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా, టాక్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీగా మారింది. దీంతో అనంత శ్రీరామ్ ఇలా రిక్వెస్ట్ చేయడానికి కారణమేంటి అనే చర్చ మొదలైంది.
Anantha Sriram
అసలేమైందంటే.. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఉన్న ఉమ్మడి స్థలాన్ని తమ అనుమతి లేకుండానే వేరొకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ అనంత శ్రీరామ్ లిఖితపూర్వకంగా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఆ ఉమ్మడి స్థలంలో అక్రమంగా చొరబడ్డారని, లారీలతో మెటీరియల్ దించారని ఆయన ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనంత శ్రీరామ్ ఈ సందర్భంగా కోరారు.
వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని తన తండ్రి తరఫున కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంత శ్రీరామ్ వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. లోకల్ సమాచారం ప్రకారం అయితే ఇది కుటుంబ వ్యవహారం అని తెలుస్తోంది. లోకల్‌గానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానూ పేరున్న రాజకీయ నాయకుడి దగ్గరి వ్యక్తుల వ్యవహారం ఇదని తెలుస్తోంది. అనంత శ్రీరామ్ కూడా ఆ కుటుంబ సభ్యులే.













