బండ్ల గణేష్ ఎప్పుడూ వార్తలలో ఉండే నటుడు మరియు నిర్మాత. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బండ్ల గణేష్ టాప్ స్టార్స్ తో మూవీలు చేసే నిర్మాతగా ఎదిగాడు. ఇక బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ మధ్య పొలిటీషియన్ గా మారిన బండ్ల గణేష్.. తమ పార్టీ గెలవకపోతే బ్లేడుతో నాలుక కోసుకుంటా అన్నాడు. పార్టీ ఓడిపోవడంతో దానిని లైట్ గా తీసుకోవాలని అందరికీ సలహా ఇచ్చాడు.
ఇక సరిలేరు నీకెవ్వరు మూవీలో ఓ కామెడీ రోల్ చేసి తనపైన తానే సెటైర్ వేసుకున్నాడు ఈయన. ఈ క్రేజీ పర్సనాలిటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాటిలో అప్పట్లో ప్రభాస్ తో ఓ మూవీ చేసే ఛాన్స్ రాగా దానిని బండ్ల గణేష్ మిస్ చేసుకున్నాడట. ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఓ మూవీ ప్లాన్ చేశారట. ఈ మూవీ విషయమై చెన్నై వెళ్లి లారెన్స్ ని కూడా కలిసిన బండ్ల ఎందుకో వెనక్కి తగ్గారట.
ఇండియన్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ తో మూవీ మిస్ అయ్యానే.. అని ఇప్పటికీ బండ్ల బాధపడతాడట. అలాంటివి నేను చాలా మిస్ అయ్యాను, అదంతా స్వయంకృతాపరాధం అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇక హరీష్ తో గొడవపై కూడా ఆయన స్పందించారు. కుటుంబ సభ్యుల మధ్యే గొడవలు వస్తుంటాయి, మేము మాటామాటా అనుకున్నాం. హరీష్ గొప్ప డైరెక్టర్, నాకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఐతే ఇకపై హరీష్ తో మూవీ చేయను… ఒకటి చేశా చాలు, అన్నారు.