NTR30: ‘ఎన్టీఆర్ 30’ టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు… అప్పుడే బండ్ల గణేష్ రచ్చ

  • May 19, 2023 / 09:10 PM IST

బండ్ల గణేష్‌.. పవన్ కళ్యాణ్ ను ‘దేవర’ అంటూ సంబోధిస్తారు. బండ్ల గణేష్ నిర్మాణంలో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ ల తర్వాత మరో సినిమా చేయడానికి కూడా పవన్ రెడీ అయ్యారు. కానీ అప్పుడు కుదరలేదు. రీ ఎంట్రీ తర్వాత సినిమా చేస్తానని ప్రత్యేకంగా చెప్పారు.అందుకోసమే అనుకుంట.. బండ్ల గణేష్ ‘దేవర’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నాడు. కానీ రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ టైటిల్ ఎన్టీఆర్ 30 కి ఫిక్స్ చేసినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే నిర్మాతలైన యువసుధ ఆర్ట్స్ వారు కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు కానీ అధికారికంగా ప్రకటించింది లేదు. అయితే ఈలోగానే సోషల్ మీడియాలో ట్వీట్లతో రచ్చ మొదలుపెట్టాడు బండ్ల గణేష్. ” ‘దేవర’ నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నా టైటిల్‌. నేను మరచిపోవడం వల్ల నా టైటిల్‌ కొట్టేశారు’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్‌ చేశాడు బండ్ల గణేష్. ఆ తర్వాత ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్… ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ‘ అంటూ కవరింగ్ ట్వీట్ మరొకటి పెట్టాడు.

ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో బండ్ల గణేష్ కు ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఉంది. బండ్ల గణేష్ నిర్మాణంలో ఎన్టీఆర్ ‘బాద్ షా’ ‘టెంపర్’ అనే సినిమాలు చేశాడు. ‘ ‘బాద్ షా’ వల్ల నాకు కొంత నష్టం వచ్చిందని బండ్ల గణేష్ చెప్పాడు.అలాగే ‘టెంపర్’ సినిమా సెట్లో బండ్ల గణేష్ ఉంటే ఎన్టీఆర్.. ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోయాడనే’ కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే అందులో నిజం లేదని తర్వాత బండ్ల గణేష్ చెప్పి.. ‘బాద్ షా’ గురించి అలా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పాడు. పాత గొడవలు మనసులో పెట్టుకుని బండ్ల గణేష్ ఇలాంటి కామెంట్లు చేసాడని కొందరు అనుకుంటున్నారు కానీ.. బండ్ల గణేష్ ఆ టైంకి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు అంతే అనుకునేవారు కూడా ఉన్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus