Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి
- August 22, 2026 / 11:18 AM ISTByPhani Kumar
ఇటీవల ‘కొంతమంది యంగ్ హీరోలు కనిపించడం లేదు’ అంటూ సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ జరిగింది. ‘ఆర్ ఎక్స్ 100 కార్తికేయ’ వంటి హీరోలను ఈ డిస్కషన్లోకి తీసుకొచ్చారు. ఒకసారి చిరంజీవి ముందు కార్తికేయ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. ‘రాంచరణ్ మాత్రమే కాదు మీ ఇన్స్పిరేషన్ తో సినిమాల్లోకి వచ్చిన మేమంతా మీ వారసులమే’ అంటూ చెప్పుకొచ్చాడు. చిరు కూడా కార్తికేయ మాటలకి ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ఒక యాడ్లో కూడా చిరుతో కలిసి కార్తికేయ నటించాడు.
Bandla Ganesh

కానీ 2 ఏళ్ళ నుండి కార్తికేయ సినిమాలు రాకపోవడంతో ‘బాస్ తోక్కెసి ఉంటాడు’ అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా కొందరు ఉదయ్ కిరణ్, సుమన్ టాపిక్స్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ టాపిక్ పై చాలా మీమ్స్ వచ్చాయి. ‘ఏదైనా ఎత్తుగా ఉంటే బాస్ తో చెప్పి తొక్కించేద్దాం’ అంటూ కొందరు సెటైర్లు వేశారు. వీటి ప్రస్తావన నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లోకి తీసుకొచ్చారు టాలీవుడ్ యాక్టర్,ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్(Bandla Ganesh).
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ” ఆయన(చిరంజీవి) గురించి కొందరు మాట్లాడుతూ ఉంటారు. ‘చిరంజీవి తోక్కేశాడు.. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవ్వరినీ తొక్కడయ్యా. ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు,లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే,వాళ్ళని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం,ఆదర్శం, అభిమానం..! చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా,ఏం చెప్పినా తగ్గదు” అంటూ బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.
‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!
















