‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది. సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేకపోతుంది.ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు.ఏపిలో పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ నైజాం, ఓవర్సీస్ విషయంలో చేతులెత్తేసింది.’బంగార్రాజు’ 15డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
8.21 cr
సీడెడ్
7.35 cr
ఉత్తరాంధ్ర
4.93 cr
ఈస్ట్
3.98 cr
వెస్ట్
2.84 cr
గుంటూరు
3.46 cr
కృష్ణా
2.19 cr
నెల్లూరు
1.85 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
34.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
38.01 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.38.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ ను ఫుల్ గా వాడుకుంటే తప్ప అది అసాధ్యమనే చెప్పాలి. జనాల్లో కరోనా థర్డ్ వేవ్ భయం ఉండడం వలన థియేటర్లకు రావడం లేదని స్పష్టమవుతుంది.