Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

  • January 27, 2022 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

అన్ని సినిమాలు కొబ్బరి కాయ కొట్టగానే గుమ్మడికాయ కొట్టే వరకు వెళ్ళవు.ఒకవేళ వెళ్ళినా థియేటర్లలోకి వస్తాయన్న గ్యారెంటీ లేదు. సరే ప్రస్తుతానికి.. అధికారిక ప్రకటన వచ్చి ఆగిపోయిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఏవేవో కారణాలతో అనౌన్స్ చేసిన సినిమాల్లో ఆగిపోయినవి చాలానే ఉన్నాయి. కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా.. మరికొన్ని వివాదాల కారణంగా… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చిన్న హీరోలకు మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ లిస్ట్ లో చాలానే ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) వినాలని ఉంది : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అశ్వినీ దత్ గారి నిర్మాణంలో చిరంజీవి చేయాల్సిన సినిమా ఇది. షూటింగ్ కూడా 50శాతం పూర్తయ్యింది. కానీ రాంగోపాల్ వర్మ తిక్క వల్ల ఆగిపోయింది.

2) అబు బాగ్దాద్ గజదొంగ : ఈ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్ళింది.. కొన్ని వివాదాల కారణంగా ఆగిపోయింది.

3) విక్రమ్ సింహా భూపతి : బాలకృష్ణ- కోడి రామకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా ఇది. 80శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది.

4) హరిహర మహాదేవ్ : బి.గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో రూపొందాల్సిన మూవీ ఇది. అనౌన్స్మెంట్ వచ్చింది కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

5) నర్తనశాల : బాలకృష్ణ, సౌందర్య కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీ ఇది. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. షూట్ చేసినంత మట్టుకు ఓటిటిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

6) రాధా : వెంకటేష్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన మూవీ ఇది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమా కూడా ఆగిపోయింది.

7) ఆట నాదే వేట నాదే : వెంకటేష్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన మూవీ ఇది. కొంతభాగం షూటింగ్ కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

8) నాగార్జున- మహేష్ బాబు- మణిరత్నం కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కాల్సింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

9) నాగార్జున- ధనుష్ : ఈ కాంబోలో కూడా మూవీ రాబోతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

10) సత్యాగ్రహి : ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కానీ.. ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్ళలేదు.

11) పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో జీసెస్ క్రైస్ట్ అనే థీమ్ తో ఓ సినిమాని అనౌన్స్ చేశారు.కానీ అనౌన్స్‌మెంట్‌తోనే అది ఆగిపోయింది.

12)చెప్పాలని ఉంది : ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘చెప్పాలనివుంది’ అనే మూవీ తెరకెక్కాలి. కానీ అది షూటింగ్ దశలో ఆగిపోయింది.

13) రవితేజ – మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు.

14) హరే రామ హరే కృష్ణ : మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీ ఇది. ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.

15) మిస్టర్ పర్ఫెక్ట్ : మహేష్ బాబు – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందాల్సిన మూవీ ఇది. అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది.

16) కొరటాల -రాంచరణ్ : ఈ కాంబినేషన్లో రెండు సార్లు సినిమాని అనౌన్స్ చేశారు. కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు. చివరికి ‘ఆచార్య’ తో ఆ ముచ్చటని తీర్చుకుంటున్నారు.

17) మెరుపు : రాంచరణ్ – ధరణి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీ ఇది. కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. కొంతభాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ తర్వాత ఆగిపోయింది.

18) నాగ చైతన్య – ‘ఢమరుఖం’ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్లో ఓ మూవీని ప్రకటించారు. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.

19) పేట : నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కాల్సిన మూవీ ఇది.సత్యదేవ్ మరో హీరోగా ఎంపికయ్యాడు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

20) మిర్చి : మహేష్ బాబు హీరోగా కె.ఎల్.నారాయణ్ నిర్మాణంలో జస్తీ హేమాంబర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది.అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chepalaniundi
  • #Hare Rama Hare Krishna
  • #Koratala
  • #Merupu
  • #Mirchi

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

16 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

17 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

17 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

18 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

20 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version