టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే అమ్మాయితో సాయి శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. మొన్నామధ్య రోకా ఫంక్షన్ కూడా జరిగింది.ఇక ఈరోజు నిశ్చితార్థం కూడా జరిగింది.
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో శ్రీనివాస్ – కావ్య రెడ్డి..ల ఎంగేజ్మెంట్ జరిగింది. కొద్దిపాటి బందుమిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్ద వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు అని చెప్పాలి.
కావ్య రెడ్డి కుటుంబ నేపథ్యం కూడా అందరికీ తెలిసిందే. ఆమె తాతగారు ఓ రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి నగరంలో ప్రముఖ లాయర్. అలాగే చాలా బిజినెస్..లు కూడా ఉన్నాయి. కావ్య వందల కోట్లకు వారసురాలు అని తెలుస్తోంది.ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించుకున్నట్టు వినికిడి. ఇక శ్రీనివాస్- కావ్యల వివాహం ఏప్రిల్ 29వ తేదీన తిరుమల పుణ్యక్షేత్రంలో జరగనుంది.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరుగుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా బెల్లంకొండ ఫ్యామిలీ ఉన్నట్టు సమాచారం.ఇక సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘టైసన్ నాయుడు’ ‘హైంధవం’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేసి నిశ్చితార్దం ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :