హిందీలో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత తెలగులోకి వచ్చి.. తమిళంలోకి వెళ్లి.. ఎక్కడా హిట్లు లేకపోయినా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది భాగ్యశ్రీ భోర్సే. విజయాలు లేకపోయినా ఎలా ఛాన్స్‌లు వస్తున్నాయి అనే డౌట్ అందరికీ ఉంది. అయితే తన అందం, అభినయంతో నెట్టుకొస్తోంది అని అంటున్నారు. ఈ విషయం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆమె నాలుగో ఇండస్ట్రీకి వెళ్తోంది అనే విషయం గురించి చూద్దాం. మామూలుగా అయితే హీరోయిన్లకు ఇది కామన్.
కానీ, భాగ్యశ్రీ భోర్సే ఇప్పుడు చేస్తోంది అంటున్న పని కాస్త విచిత్రంగానే ఉంది. అందులో ఇప్పుడు ఈ వయసులో, ఈ ఫేమ్‌లో ఇలాంటి ఫీట్ చేయడం సరికాదు అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి కారణం ఆమె తన కొత్త సినిమాగా మలయాళ స్టార్ కథానాయకుడు మోహన్‌లాల్‌తో ఓ సినిమా ఓకే చేసింది అనే వార్త రావడమే. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్ 367’ (వర్కింగ్ టైటిల్)లో భాగ్యశ్రీ నటిస్తోందట.
ఈ మధ్యే ప్రకటించిన ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సేని అనుకుంటున్న టీమ్ ప్రస్తుతం చర్చలు జరుపుతోందట. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా టీమ్ హీరోయిన్ పాత్రకు భాగ్యశ్రీ అయితే బెటర్ అని ఫిక్స్ అయిందట. అయితే హీరోయినా పాత్రనా? లేక కీలక పాత్రనా అనేది తెలియదు. ఇక ఆమె లైనప్ చూస్తే.. తెలుగులో అఖిల్‌తో ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సెయాన్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఇలా తెలుగు, తమిళంలో కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ సమయంలో మలయాళంల వెళ్లి సీనియర్ స్టార్ హీరోతో నటించడం ఏంటి అనేదే ప్రశ్న. అయితే ఆమెకు ఇలా సీనియర్ హీరోలతో నటించడం కొత్తేమీ కాదు. తెలుగులో చేసిన తొలి సినిమా ‘మిస్టర్ బచ్చన్’లో హీరో సీనియరే కదా. అయితే అలా కనిపించడు అనుకోండి.