Bhaje Vaayu Vegam Collections: ‘భజే వాయు వేగం’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • June 1, 2024 / 05:54 PM IST

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ (Karthikeya).. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ, ఏది కూడా దాని రేంజ్లో బ్లాక్ బస్టర్ కాలేదు. ‘బెదురులంక 2012 ‘  (Bedurulanka 2012) గత ఏడాది రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ అది ‘ఆర్.ఎక్స్.100’ రేంజ్ సక్సెస్ కాదు. ఇక అతను హీరోగా రూపొందిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే మూవీ మే 31 న రిలీజ్ కాబోతుంది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు.

రథన్ (Radhan) సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.13 cr
సీడెడ్ 0.03 cr
ఉత్తరాంధ్ర 0.05 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.02 cr
 ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.40 cr (షేర్)

‘బెదురులంక 2012’ చిత్రానికి రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.40 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.40 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus