భరత్ అను నేను షెడ్యూల్ ఎప్పుడంటే?

  • October 13, 2017 / 12:51 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పైడర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు స్పైడర్ రిలీజ్ అనంతరం కుటుంబంతో కలిసి మహేష్ విదేశీ టూర్ కి వెళ్లారు. ఆయన రేపు హైదరాబాద్ కి రానున్నారు. దీంతో భరత్ అను నేను మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. రెండో షెడ్యూల్ ఆదివారం(అక్టోబర్ 15) నుంచి ప్రారంభం కానుంది.

గత షెడ్యూల్ ల్లో అసెంబ్లీ  సన్నివేశాలను తెరకెక్కించిన కొరటాల ఈ సారి కైరా అద్వానీ, మహేష్ లపై రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు సమాచారం. రాజకీయనేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి  బాగా నవ్విస్తారని తెలిసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ షూటింగ్ లో ఆలస్యం కారణంగా ఏప్రిల్ కి వాయిదా వేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus