పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. పవన్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే సులువుగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయి. ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కాకపోయినా టికెట్ రేట్లు పెంచి ఉంటే ఆ సినిమా కలెక్షన్లు 120 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండేవని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఏపీలో పవన్ సినిమాలకు టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉండటం వల్ల పవన్ సినిమాలు కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేయడం కష్టమవుతోంది. అయితే కొన్ని రికార్డులు మాత్రం ఇప్పటికీ పవన్ ఖాతాలోనే ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తక్కువ యూట్యూబ్ ఛానెళ్లలో స్ట్రీమింగ్ కాగా ఎక్కువమంది లైవ్ స్ట్రీమింగ్ ను చూసిన రికార్డును సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట ఈ రికార్డును బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయ్యాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రికార్డు పదిలంగా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇప్పట్లో ఈ రికార్డును మరో సినిమా బ్రేక్ చేయడం కూడా సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. రీఎంట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న పవన్ కు తర్వాత సినిమాలు కూడా విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
పవన్ ఈ సినిమాకు 60 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది. పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధిస్తే సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతోంది.