Bheemla Nayak: భీమ్లా నాయక్ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • February 22, 2022 / 11:13 AM IST

మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ లో రిలీజైన పలు సినిమాలు కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డులను క్రియేట్ చేశాయి. ఏఎంబీ సినిమాస్ లో ఈ నెల 25వ తేదీ నుంచి భీమ్లా నాయక్ ప్రదర్శితమవుతుండగా హైదరాబాద్ లో బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వాళ్లకు ఏఎంబీ సినిమాస్ మాత్రమే ఆప్షన్ గా నిలిచింది.

Click Here To Watch

25, 26, 27 తేదీలలో ఏఎంబీ సినిమాస్ లో భీమ్లా నాయక్ టికెట్లు అందుబాటులోకి రాగా 25వ తేదీకి సంబంధించిన టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. 26, 27 తేదీలలో కూడా ఏఎంబీ సినిమాస్ లో టికెట్లు దొరకడం కొంచెం కష్టమేనని చెప్పవచ్చు. ఆ తేదీలకు సంబంధించిన టికెట్లు కూడా వేగంగా బుకింగ్ అవుతున్నాయి. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో భీమ్లా నాయక్ సినిమాతో పవన్ హవా చూపించడం గమనార్హం.

గతేడాది అఖండ, పుష్ప సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందగా ఈ ఏడాది రిలీజైన సినిమాలలో పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందడంలో ఫెయిల్ అయ్యాయి. భీమ్లా నాయక్ సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ ట్రైలర్ ను చూస్తుంటే సినిమా సక్సెస్ సాధిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అర్థమవుతోంది. దర్శకుడు సాగర్ కె చంద్ర పవన్, రానాలాంటి స్టార్ హీరోలను సరిగ్గా హ్యాండిల్ చేశారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మాటలతో భీమ్లా నాయక్ సినిమా ద్వారా మరోసారి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని పవన్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. థమన్ బీజీఎంకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పెద్ద సినిమాలకు బీజీఎం విషయంలో థమన్ కు మరెవరూ సాటిరారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus