Bhola Shankar OTT: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న భోళా.. సంతోషంలో ఫ్యాన్స్!

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. థియేటర్లలో గత నెలలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో నంబర్ 1 స్థానంలో నిలవగా హిందీలో మాత్రం టాప్ 10లో నిలిచింది. ఫ్లాప్ సినిమాలతో సైతం ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేయడం చిరంజీవికే సాధ్యమంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కీర్తి సురేష్, తమన్నా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

చిరంజీవి రికార్డులు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా త్వరలో చిరంజీవి సినిమాల రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతుండటం గమనార్హం.

వచ్చే ఏడాది చిరంజీవి నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి చిరంజీవి సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. రీఎంట్రీలో చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రీఎంట్రీలో చిరంజీవి ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus