Bhuma Mounika: జనసేన పార్టీ నుంచి ఆ ప్రాంతం నుంచి పోటీకి సిద్ధమైన భూమా మౌనిక?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతోనే రాజకీయాలలో ముందుకు కదులుతున్నారు ఇకపోతే ఎన్నికలలో కేవలం ఒక సీటు మాత్రమే గెలిచిన జనసేన పార్టీకి ప్రస్తుతం మాత్రం ఓటు బ్యాంకు కాస్త పెరిగిందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు రాబోతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు మొదలయ్యాయి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కూడా ఎంతోమంది ఈ పార్టీలోకి చేరుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ పార్టీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

భూమ మౌనిక రెడ్డి కుటుంబానికి ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే భూమా అఖిలప్రియ మాజీ మంత్రిగా కొనసాగారు ఇక ఈమె తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూమ మౌనిక రెడ్డి కూడా జనసేన పార్టీలోకి చేరడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది అయితే ఈమెతో పాటు మనోజ్ కూడా ఈ పార్టీలో చేరుతున్నారని వీరిద్దరూ కూడా సీమ ప్రాంతం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా మౌనిక రెడ్డి జనసేన పార్టీలోకి రాబోతున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది. ఇక మౌనిక రెడ్డి రాజకీయాలలోకి వస్తాను అంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని తాను ఏం చేస్తున్న తన సపోర్ట్ తనకు ఉంటుంది అంటూ మొదటి నుంచి మనోజ్ చెబుతున్న విషయం మనకు తెలిసిందే. మరి భూమా మౌనిక రెడ్డి జనసేన పార్టీలోకి రాబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ వార్తలపై మనోజ్ లేదా మౌనిక స్పందించాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus