ఈషా రెబ్బా…ఓ తెలుగమ్మాయి. ఈ అమ్మడుకి పెద్దగా హిట్లు లేకపోయినా క్రేజ్ మాత్రం పీక్స్ లో ఉంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈషా.. ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ!’ వంటి చిత్రాల్లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఒక్క ‘అరవింద సమేత’ చిత్రాన్ని పక్కన పెడితే.. పెద్ద సినిమాల్లో ఈమెకు అవకాశాలు రాకపోతున్నప్పటికీ ఈమెకు సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఈమె అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తుంది. ఈ విషయాల్ని పక్కన పెడితే తాజాగా తన ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఈ బ్యూటీ. వివరాల్లోకి వెళితే.. ఈమె ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారట.ఈ విషయాన్ని స్వయంగా ఈషా రెబ్బానే తన ఇనస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘ఏవైనా అసభ్యకరమైన పోస్టులు, ఫొటోలు కనుక తన ఎకౌంట్ లో ప్రత్యక్షమైతే వాటిని ఇగ్నోర్ చెయ్యమని..
వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని’ ఈమె చెప్పుకొచ్చింది. ఈమధ్య కాలంలో ఈషా వరుసగా తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతలో ఇలా జరగడం ఆమె ఫ్యాన్స్ కు నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈషా ‘లస్ట్ స్టోరీస్’ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో నటిస్తుంది.