Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్
- November 18, 2026 / 12:05 AM ISTByPhani Kumar
తరుణ్ భాస్కర్.. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. అయితే మిగతా దర్శకుల్లా తన రెండో సినిమాని పెద్దగా ప్లాన్ చేసుకోకుండా.. అప్ కమింగ్ యాక్టర్స్ తో ‘ఈ నగరానికి ఏమైంది’గా తీశాడు. ధియేటర్స్ లో ఈ సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. అయితే ఓటీటీలో, రీ రిలీజ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సోషల్ మీడియాలో ‘ఈ నగరానికి ఏమైంది’ మీమ్ టెంప్లేట్స్ ఏ రేంజ్లో వైరల్ అవుతాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Eesha Rebba

ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే దానికి సీక్వెల్ గా ‘ఈ ఎన్ ఈ రిపీట్’ తీశాడు తరుణ్ భాస్కర్. నవంబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా.. తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ..”గత రెండేళ్లుగా తరుణ్ చాలా కష్టాలు పడ్డాడు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం లాంటి విషయాలతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంటికి రాని రోజులు చాలా ఉన్నాయి.
వచ్చినా అర్ధరాత్రి 2-4 గంటలకు వచ్చేవాడు. ఈ సమయంలో అతనికి అండగా నిలిచింది ఈషా(ఈషా రెబ్బా). ఈషా(Eesha Rebba) అతనికి మంచి తోడు, స్నేహితురాలు.! ‘నాకు వయసైపోతుంది, తరుణ్ ఏమైపోతాడా?’ అని భయం వేసేది. కానీ ఈషా రూపంలో తరుణ్ కి మంచి తోడు దొరికింది. ‘ఈ ఎన్ ఈ 2’ పూర్తిచేయడానికి కూడా ఈషా అతనికి సపోర్ట్ చేసింది” అంటూ గీతా భాస్కర్ తెలిపింది. కొన్నాళ్ళుగా తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా సహజీవనంలో ఉన్నారు అంటూ వచ్చిన వార్తాలకి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.
‘వారణాసి’ రిలీజ్పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?
2 ఏళ్ళ నుండీ తరుణ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు
కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయి
ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయి
ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికింది
ఆమెనే ఈషా.. తరుణ్ ఫ్రెండ్, సపోర్ట్
నాకు వయసు అవుతుంది ఎలాగా అని భయపడ్డాను
కానీ ఈషా రూపంలో తరుణ్ కి మంచి తోడు దొరికింది
ఫ్రెండ్స్ కి అన్ని విషయాలు చెప్పుకోలేము.. ఒక తోడు కావాలి
ఆమె వల్లనే ‘ఈ ఎన్ ఈ 2’ పూర్తిచేయగలిగాడు : గీతా భాస్కర్
#ENERepeat #TharunBhascker #VishwakSen #AbhiinavGomatam #SrinathMaganti #VenkateshKakumanu
— Filmy Focus (@FilmyFocus) November 17, 2026











