ఇప్పటికే కరోనా బాధితులకు ఎటువంటి సాయం చెయ్యడం లేదు అన్న విమర్శలు ఎక్కువే ఉన్నాయి. ఒక్క ప్రణీత, లావణ్య త్రిపాఠి ని పక్కన పెడితే చాలా మంది హీరోయిన్ల పై సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్న హీరోయిన్లు… కష్టం వచ్చినప్పుడు పేద సినీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మెగాస్టార్ చిరంజీవి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ.. వంటి వారు కామెంట్స్ చేసారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హీరోయిన్లకు పెద్ద గండం ముందు ఉంది అంటూ కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు అలాగే.. షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలు… అలాగే షూటింగ్ మొదలు కావాల్సిన సినిమాలు… వాటితో పాటు విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఎంత కాదు అనుకున్నా… జూలై లేదా ఆగష్టు నుండీ షూటింగ్ లు మొదలవుతాయి. అయితే ఆ టైములో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల ప్రమోషన్ లకు హాజరుకావడంతో పాటు … సగం షూటింగ్ పూర్తయిన సినిమాలకు అలాగే..
కొత్తగా ప్రారంభం అయ్యే సినిమాల షూటింగ్ లకు హాజరుకావాల్సి ఉంటుంది. నేపధ్యంలో హీరోయిన్ లు తమ డేట్స్ ను అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దాంతో పెద్ద సినిమాల కోసం మీడియం, చిన్న సినిమాలను టాప్ హీరోయిన్లు వదులు కోవాల్సి వస్తుందట. అయితే ఈ క్రమంలో కొత్త హీరోయిన్లు, అవకాశాలు లేని హీరోయిన్లకు అవకాశాలు దక్కే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలుస్తుంది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!